- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Myanmar: మయన్మార్ భూకంపం.. 334 అటామిక్ బాంబులతో సమానం

దిశ, నేషనల్ బ్యూరో: మయన్మార్ ని వరుస భూకంపాలు వణికించాయి. శుక్రవారం 7.7 తీవ్రతతో భూమి కంపించింది. అయితే, ఈ భూకంపం 334 అటామిక్ బాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనానికి కారణైనట్లు స్థానికి భూవిజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనికిస్ తెలిపారు. ఈ ప్రాంతంలో మరికొన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భారత టెక్టానిక్ ఫలకాలు యురేషియన్ ప్లేట్స్‌ను వరుసగా ఢీకొంటుండడం వల్ల నెలల తరబడి ఆఫ్టర్‌షాక్స్ వచ్చే అవకాశం ఉందని జెస్ ఫీనిక్స్ తెలిపారు. దేశంలో కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా మయన్మార్ విపత్తు మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. కమ్యూనికేషన్‌లో అంతరాయం వల్ల అక్కడి పూర్తిస్థాయి పరిస్థితులను గుర్తించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. భూఉపరితలానికి 10 కి.మీ లోతులోనే ప్రకంపనల కేంద్రాలు ఉన్నాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఇకపోతే, ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10వేలు దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ అంచనా వేసింది. కాగా ఇప్పటి వరకూ 1,600 మందికి పైగా మృతి చెందినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం ప్రకటించింది.
థాయ్ లాండ్ లో ఆరుగురు మృతి
మరోవైపు, థాయ్ లాడ్ లో ఈ విపత్తు వల్ల ఆరుగురు చనిపోగా.. 22 మంది చనిపోయారు. 101 మంది గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా, చైనా సౌత్ వెస్ట్ లోని యూనన్ ప్రావినెన్స్ లోనూ భూమి కంపించింది. ఇకపోతే, ఈ కష్టసమయంలో అక్కడి ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు భారత్ ఇప్పటికే ముందుకొచ్చింది. ఆపరేషన్ బ్రహ్మ’ కింద దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని అక్కడికి పంపించింది. అంతే కాకుండా విపత్తులో ఉన్న ఆ దేశానికి సాయం చేసేందుకు 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని అక్కడికి పంపుతున్నట్లు పేర్కొంది. అమెరికా, ఇండోనేషియా, చైనా, రష్యా సహా ఇతర దేశాలు కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి.