- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇంటర్ పరీక్షల ఫలితాలు.. విద్యార్థులకు వీసీ సజ్జనార్ కీలక సందేశం

దిశ, వెబ్ డెస్క్: పరీక్షల్లో తప్పితే జీవితం సర్వం కోల్పోయినట్లు కాదు కదా! అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (TGSRTC MD VC Sajjanar) అన్నారు. తెలంగాణలో మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల (Inter Results)లో ఫెయిల్ అయ్యామని మనస్థాపం చెంది ఐదుగురు విద్యార్థులు బలవన్మరనానికి (Suicide) పాల్పడ్డారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన సజ్జనార్.. విద్యార్థులకు కీలక సందేశం (Key Message) ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన.. చదువు అంటే ర్యాంకులు, మార్కులు కాదనే విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోకపోవడం వల్లే ఇలాంటి బలవన్మరణాలు జరుగుతున్నాయని తెలిపారు.
పరీక్షలో ఫెయిల్ అయితే.. ఆ ఓటమిని గుణపాఠంగా తీసుకుని జీవితంలో ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉన్నా.. ఓటమి జీవితానికి అంతంగా భావిస్తుండటం బాధాకరమని అన్నారు. అలాగే పరీక్షలో పాస్ కాకపోతే మరింత కష్టపడాలి.. లోపాలను సరిదిద్దుకొని ముందుకుసాగాలి.. అంతేకానీ అర్దాంతరంగా చనిపోతే ఏం వస్తుందని ప్రశ్నించారు. అంతేగాక ఒక్క పరీక్ష తప్పితే వెంటనే మరో అవకాశం ఉంటుంది.. జీవితం ముగిస్తే తిరిగిరాదు కదా అని అన్నారు. ఫెయిల్ అయితే మళ్ళీ పాస్ కావొచ్చని పిల్లలను తల్లిదండ్రులు వెన్నుతట్టి ప్రోత్సహించాలి.. వాళ్ళు పాస్ అయ్యారు.. నువ్వు ఎందుకు కాలేదు అని ఎదుటివారితో పోల్చకుండా పిల్లల్లో స్వతహాగా ఉన్న ప్రతిభను గుర్తిస్తూ ఆత్మవిశ్వాసం పెంపొందించాలని సజ్జనార్ సూచించారు.