హార్దిక్ పాండ్యా కు బిగ్ షాక్.. భారీ ఫైన్!

by Veldandi saikiran |   ( Updated:2025-03-30 06:51:41.0  )
హార్దిక్ పాండ్యా కు బిగ్ షాక్.. భారీ ఫైన్!
X

దిశ, వెబ్ డెస్క్ : ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ( Hardik Pandya ) బిగ్ షాక్ తగిలింది. శనివారం రోజున... ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో ( Mumbai Indians vs Gujarat Titans match ) హార్దిక్ పాండ్యా స్లో ఓవర్ రేట్ కు గురయ్యాడు. దీంతో.. హార్దిక్ పాండ్యా పైన...ఇండియన్ ప్రీమియర్ లీగ్ కౌన్సిల్ ( Indian Premier League Council ) భారీ ఫైన్ వేసింది. స్లో ఓవర్ రేట్ కారణంగా... హార్దిక్ పాండ్యా పై ఏకంగా 12 లక్షల భారీ ఫైన్ వేసింది ఐపీఎల్ కౌన్సిల్. ఐపీఎల్ ( IPL ) ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం ఈ ఫైన్ వేశారు.


అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ నేషనల్ మీడియాలో... కథనాలు వస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ కు హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. గత సీజన్ లో ఇలాగే వరుసగా జరిమానా కు గురైన హార్దిక్ పాండ్యా పై... ఒక మ్యాచ్ నిషేధం విధించింది ఐపీఎల్ కౌన్సిల్. అందుకే ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ లో ముంబై తరఫున మొదటి మ్యాచ్ ఆడలేదు. నిన్న గుజరాత్ పై మాత్రం ముంబై కెప్టెన్ లో బరిలోకి దిగాడు హార్దిక్ పాండ్యా. అయితే నిన్నటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడిపోయిన బాధలో ఉన్న హార్దిక్ పాండ్యాకు మరో షాక్ ఇచ్చింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కౌన్సిల్. స్లో ఓవర్ రేట్ కారణంగా... హార్దిక్ పాండ్యా పై 12 లక్షల ఫైన్ వేసిందట.



Next Story

Most Viewed