CM Chandrababu: నిరుపేదలకు తీపి కబురు.. ఆ ఫైల్‌పై సంతకం చేసిన సీఎం చంద్రబాబు

by Shiva |   ( Updated:2025-03-30 07:25:13.0  )
CM Chandrababu: నిరుపేదలకు తీపి కబురు.. ఆ ఫైల్‌పై సంతకం చేసిన సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉగాది (Ugadi) పర్వదినాన నిరుపేదలకు కూటమి సర్కార్ తీపి కబురు చెప్పింది. అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకుని ఆర్థికంగా సతమతమవుతోన్న కుటుంబాలను ఆదుకునేందుకు సీఎంఆర్ఎఫ్ కింద నిధులు విడుదల చేస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) సంబంధిత ఫైలుపై ఇవాళ సంతకం చేశారు. ఈ మేరకు రూ.38 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ కానున్నాయి. సీఎంఆర్ఎఫ్ (CMRF) ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3,456 మందికి లబ్ధి చేకూరనుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సీఎంఆర్ఎఫ్ (CMRF) ద్వారా ఇప్పటి వరకు 23,418 మంది పేదలకు రూ.281.38 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed