Viral Reel: విదేశీయులు మెచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం..' వెంకీ మావాను ఎలా ఇమిటేట్ చేశారో చూడండి!

by Vennela |
Viral Reel: విదేశీయులు మెచ్చిన సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ మావాను ఎలా ఇమిటేట్ చేశారో చూడండి!
X

దిశ, వెబ్ డెస్క్: Viral Reel: సంక్రాంతికి వస్తున్నాం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే . అనిల్ రావిపూడి-వెంకటేశ్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది. గతంలో ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలతో వెంకటేశ్ కు భారీ సక్సెస్ ఇచ్చిన అనిల్ రావిపూడి సంక్రాంతికి పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు బ్లాక్ బస్టర్ రివ్యూలు వచ్చాయి. అసలు ఈ సినిమాను ఆదరిస్తారా అనుకుంటే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు ప్రేక్షకులు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్ల హంగామా మామూలుగా లేదు. ఈ మూవీపై మీమ్స్ బీభత్సంగా పేలుతున్నాయి.

ఈ మూవీలో ముఖ్యంగా బుల్లిరాజు పాత్రలో నటించిన రేవంత్ భీమల బాలనటుడు ఇరగదీశాడు. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీలు కూడా ప్రేక్షకులను నవ్వించారు. అయితే ఈ మూవీపై రకరకాల మీమ్స్ వచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇంతకంటే మంచి ఛాయిస్ ఎక్కడ ఉంటుందని నిరూపించారు. అయితే సంక్రాంతికి వస్తున్నాం మూవీ కంటే ముందు గేమ్ ఛేంజర్ మూవీ కూడా రిలీజ్ అయ్యింది. అయితే ఆ మూవీని పక్కన నెట్టి వెంకటేశ్ మూవీనే దూసుకుపోయింది. రివ్యూవర్లు, కామన్ ఆడియన్స్ సైతం ఈ మూవీకే జై కొట్టారు. చిన్న సినిమాగా వచ్చిన భారీ విజయాన్నే అందుకుంది.

అయితే ఈ మూవీలో ఐశ్వర్య రాజేశ్, వెంకటేశ్, మీనాక్షి చౌదరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. వీరి ముగ్గురి మధ్య వచ్చే ఓ ఫన్నీ సీన్ ను విదేశీయులు కూడా మెచ్చారు. వెంకీ మావను ఇమిటేట్ చేస్తూ ఓ రీల్ చేశారు. ఇదిగో వచ్చింది మీనాక్షీ..ఇందగా ఆ మూలకు వెళ్లి కులికారు..ఇప్పుడు ఈ మూలకు వెళ్లి కులకండి.. వాట్ ద హెల్ అనే డైలాగ్ విదేశీయులు ఎంత బాగా చేశారు. వీరి యాక్షన్ కు నెటిజన్లు సైతం ఫిదా అయ్యారు. తెలుగు లాంగ్వేజ్ కు ఇంటర్నెషనల్ అంబాసిడర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Next Story