TG Govt.: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్రానికి రానున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్

by Shiva |
TG Govt.: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్రానికి రానున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎలక్ట్రిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ (Electric Vehicle and Energy Storage) పాలసీకి ఊతమిచ్చేలా తెలంగాణ సర్కార్ (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రాబోతోంది. త్వరలోనే చైనా (China)కు చెందిన దిగ్గజ ఎలక్ట్రికల్ కార్ల సంస్థ బీవైడీ (BYD), హైదరాబాద్‌ (Hyderabad) శివారు ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ కార్ల యూనిట్‌‌ను నెలకొల్పేందుకు సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు కూడా మొదలు పెట్టినట్లుగా సమాచారం. అయితే, ప్రాజెక్ట్ ఏర్పాటుకు భూమి కేటాయింపు, వివిధ రకాల అనుమతులు ఇచ్చేందుకు సర్కార్ సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు సర్కార్ అనువైన మూడు ప్రదేశాలను బీవైడీ కంపెనీ ప్రతినిధులకు ప్రతిపాదించింది. వారు ఫైనల్ చేసిన వెంటనే ప్రాజెక్టుకు సంబంధించి ఆ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే.. దేశంలో బీవైడీకి తొలి యూనిట్‌గా తెలంగాణ వేదిక కానుంది. దాదాపు వేలల్లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రస్తుతం బీవైడీ ఎలక్ట్రికల్ కార్ల (BYD Electrical Cars)ను చైనా (China) నుంచి దేశానికి తీసుకువచ్చి విక్రయాలను కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇంపోర్ట్ (Export) టాక్స్‌ భారం విపరీతంగా పడుతుండటంతో ఆశించిన స్థాయిలో సెల్స్‌ లేవు. దీంతో ఆ కంపెనీ దేశంలో మొదటి ప్లాంట్‌ను ఏర్పాటు చేసి తమ కార్ల అమ్మకాలను పెంచుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government)తో ఒప్పందం చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

Next Story