- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సికింద్రబాద్‌లో ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

దిశ, వెబ్‌డెస్క్: బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం (road accident)లో ఇద్దరు యువకులు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన హైదరాబాద్ లోని సికింద్రబాద్ ప్రాంతం.. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధి (Mahankali Police Station Area)లో చోటు చేసుకుంది. రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు బైకును బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి (Died on the spot) చెందారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని.. మృతులు బన్సీలాల్ పేట కు చెందిన ప్రణయ్ (18), బోయ గూడా కు చెందిన అక్షిత్(21)గా గుర్తించారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం యువకుల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కాగా తమ కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారనే విషాద వార్తను తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read More..
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం