TG News : అసెంబ్లీ ఎదుట BRS కార్యకర్తల నిరసన

by M.Rajitha |
TG News : అసెంబ్లీ ఎదుట BRS కార్యకర్తల నిరసన
X

దిశ, వెబ్ డెస్క్ : శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు(BRS Activists) కాంగ్రెస్ ప్రభుత్వానికి(Congress Govt) వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను(Election Assurances) నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలువురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. రైతులకు మద్దతు ధర, మహిళలకు ఆర్థిక సహాయం, యువతకు ఉపాధి అవకాశాలు, విద్యార్థినులకు స్కూటర్లు వంటి హామీలు నెరవేర్చడంలో రేవంత్ సర్కార్ విఫలం అయిందని ఆరోపించారు. కాగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నవేళ ఈ అకస్మాత్తు నిరసన అసెంబ్లీ సమీపంలో కొద్దిసేపు గందరగోళం రేపింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రూ. 1.58 లక్షల కోట్ల రుణాలు తీసుకుందని, అయినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన రైతులకు మద్దతు ధర (MSP), మహిళలకు రూ. 2,500 ఆర్థిక సహాయం, విద్యార్థినులకు స్కూటీలు, వృద్ధులకు రూ. 4,000 పెన్షన్ వంటివి అమలు చేయలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల శాసన మండలిలో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మరియు రుణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Next Story