నిర్ణీత సమయంలో వస్త్ర ఉత్పత్తులు పూర్తి చేయాలి

by Sridhar Babu |
నిర్ణీత సమయంలో వస్త్ర ఉత్పత్తులు పూర్తి చేయాలి
X

దిశ, ప్రతినిధి రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా చేనేత పరిశ్రమకు ప్రభుత్వం కేటాయించిన ఆర్డర్లను నిర్ణీత సమయంలో వస్త్ర ఉత్పత్తులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రభుత్వ ఆర్డర్ల పురోగతిపై సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర శిక్షశాఖ, సంక్షేమ శాఖలకు సంబంధించి ప్రభుత్వం వస్త్ర పరిశ్రమకు అందించిన ఆర్డర్ల వస్త్ర ఉత్పత్తిని నిర్ణీత సమయంలో పూర్తిచేసి సప్లై చేయాలని సూచించారు. అలాగే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద చీరల పంపిణీ కోసం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలకు వచ్చిన ఆర్డర్ పనులను వెంటనే ప్రారంభించి నిర్ణీత సమయంలో గడువులోగా ఉత్పత్తి చేసి సప్లై చేయాలన్నారు. ఈ సమావేశంలో చేనేత జౌళి శాఖ అధికారి రాఘవరావు, టెస్కో ప్రతినిధి శంకరయ్య, వస్త్ర పరిశ్రమ వ్యాపారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed