చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

by Sridhar Babu |
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
X

దిశ,డోర్నకల్(నరసింహులపేట) : విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సురేష్ తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల పరిధి కొమ్ములవంచ గ్రామ శివారులో పార్నంది మోహన్ (30) ఆకేరు వాగులో చేపల వేటకు వెళ్లి పక్కనే ఉన్న వైరుకు తగిలాడు. దంతో కరెంట్ షాకుకు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Next Story

Most Viewed