Kavitha: కేసీఆర్ ను తిట్టినా భరిస్తాం కానీ ఆ విషయంలో అబద్దాలు చెప్తే ఊరుకునేది లేదు: కవిత హాట్ కామెంట్స్

by Prasad Jukanti |   ( Updated:2025-03-21 11:57:37.0  )
Kavitha: కేసీఆర్ ను తిట్టినా భరిస్తాం కానీ ఆ విషయంలో అబద్దాలు చెప్తే  ఊరుకునేది లేదు: కవిత హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టన 2025-26 వార్షిక బడ్జెట్ కాంగ్రెస్ మార్క్ కరప్షన్ కు, కాంగ్రెస్ మార్క్ కన్నింగ్నెస్ కు ఫర్ఫెక్ట్ బ్లాక్ అండ్ వైట్ ఫ్రూప్ అని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (Kavitha) విమర్శించారు. రాష్ట్ర అప్పుల విషయంలో పదే పదే అద్భుతంగా అబద్దాలు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) ఇవాలో రేపో గిన్నిస్ రికార్డు ఇచ్చే అవకాశం ఉందన్నారు. బడ్జెట్ పై (Budget 2025-26) చర్చ సందర్భంగా ఇవాళ శాసనమండలిలో (Legislative Council) మాట్లాడిన కవిత మన దేశమే సెంటిమెంట్ కంట్రీ. రాష్ట్రానికి చోదక శక్తిగా ఉండాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేషనల్ మీడియాలో కూర్చుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అబద్ధాలు చెబుతూ తెలంగాణ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందంటే ప్రజల గుండె గుబేలుమనదా? ఈ రాష్ట్రానికి వచ్చే ఇన్వెస్టర్లను నమ్మకం కలిగించేందుకు కేసీఆర్ ధనిక రాష్ట్రం అని చెప్పారన్నారు. నెలకు రూ. 500 కోట్లు కూడా ఖర్చు చేయలకేపోతున్నానని సీఎం అంటున్నారు. క్యాపిటల్ ఎక్సపెండేచర్ కింద కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం వచ్చాక తొలి సంవత్సరం కాలంలో మొత్తం రూ.33,087 కోట్లు ఖర్చు చేసింది. అంటే నెలకు రూ. 2,750కోట్లు ఖర్చు చేశారు. ముఖ్యమంత్రికి తెలిసి కూడా కేవలం బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను బద్నాం చేయడానికే నెలకు రూ.500 కోట్లు ఖర్చు చేయలేకపోతున్నామని అబద్ధాలు చెబుతుంటే రాష్ట్రం కోసం పేగులు తెగేదాక కొట్లాడినోళ్లం బాధ అవుతుందన్నారు. ఇది వ్యక్తిగతం కాదు రాష్ట్రానికి సంబంధించిన విషయం అన్నారు. మమ్మల్ని, మా నాయకుడిని తిడితే పడుతాం కానీ రాష్ట్రాన్ని అంటే మేము ఊరుకోమన్నారు.

కాంగ్రెస్ ప్రాధాన్యత రంగమేది?:

కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని మా నాయకుడు కేసీఆర్ (KCR) ఇచ్చిన సూచనతో గత బడ్జెట్ పై ప్రభుత్వాన్ని పెద్దగా మేము విమర్శించలేదని కానీ రెండో బడ్జెట్ వచ్చేసరికి భరువు బాధ్యత ఎత్తుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుందని అన్నారు. మొదటి బడ్జెట్ లో కేసీఆర్ ను తిట్టి రెండో బడ్జెట్ లోనూ కేసీఆర్ నే తిడతామంటే ప్రజలు మెచ్చరన్నారు. మీ తిట్లతో పార్టీగా మాకు వచ్చే నష్టమేమి లేదు. మీరెన్ని తిట్లు తిట్టినా మీ మీద పోరాటం చేసే మేము తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. ఏ ప్రభుత్వమైనా ఏదైనా ఓ రంగాన్ని తమ ప్రాధాన్యత రంగంగా ఎంచుకుంటుంది. కానీ ఈ బడ్జెట్ చూస్తుంటే ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత రంగం అనేది ఏది లేదని అర్థం అవుతున్నదని విమర్శించారు. తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరంలో కేసీఆర్ రూరల్ ఎకానమీ రిచార్జీ చేయడం కోసం సంక్షేమం ద్వారా ప్రజలు డబ్బులు ఇచ్చారు. వ్యవసాయ, ఇరిగేషన్ రంగాలకు ప్రధాన్యత ఇచ్చారు. దాంతో సంపద సృష్టి జరిగిందన్నారు. ఆ తర్వాత ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ ను ఎంపిక చేసుకున్నారన్నారు. ఈ ప్రభుత్వానికి ఎలాంటి విజన్ లేదని అడిగినవాళ్లకందరికి ఎంతో కొంతా ఇచ్చుకుంటూ పోతే దాంట్లో ప్రభుత్వ ఫోకస్ ఏముందన్నారు.

Next Story

Most Viewed