- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అసెంబ్లీ నుంచి వాకౌట్.. ప్రభుత్వంపై హరీశ్‌రావు కీలక ఆరోపణలు

దిశ, తెలంగాణ బ్యూరో: సుప్రీంకోర్టులో పెండింగులో ఉన్న పార్టీ ఫిరాయింపుల విషయమై నిబంధనలకు విరుద్ధంగా సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. సభలో సీఎం మాట్లాడింది పూర్తిగా అసెంబ్లీ పార్లమెంటు వ్యవస్థకు విరుద్ధమన్నారు. కోర్టులో పెండింగులో ఉన్న విషయాలను చట్టసభల్లో మాట్లాడకూడదని కౌల్ అండ్ శకధర్ పార్లమెంటరీ ప్రొసీజర్ బుక్‌లో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉన్నా సీఎం మాత్రం అసెంబ్లీలో ఈ విషయంపై జడ్జిమెంట్ ఇచ్చారని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు డిస్ క్వాలిఫై కారని, ఉప ఎన్నికలు రానే రావని జడ్జిమెంట్ ఇచ్చారని పేర్కొన్నారు. తన పరిధిని దాటి మాట్లాడడం అసెంబ్లీ ప్రివిలేజ్ కిందకే వస్తుందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వాపస్ పోతారని డౌట్ వచ్చి ఉప ఎన్నికలు రావని మాట్లాడుతున్నారని అన్నారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద తాను చెప్పే ప్రయత్నం చేస్తే మధ్యలో తన మైక్ కట్ చేశారని అన్నారు. సలహాలు ఇవ్వచ్చని ముఖ్యమంత్రి చెప్పారని.. కానీ సలహాలు ఇవ్వడానికి మైక్ ఇవ్వాలని కోరితే ఇవ్వలేదని అన్నారు. ప్రతిపక్షం గొంతు నొక్క ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తక్కువ సభ్యులు ఉన్నవారికి మైక్ ఇస్తున్నారని, తమకు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశామని చెప్పారు. అలాగే.. బీఆర్ఎస్ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేస్తూ వచ్చిందని.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల పాలనలో కంట్రోల్ చేయడంలో విఫలమైందని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రతి మూడు గంటలకు ఒక అత్యాచారం, ఆరు గంటలకు ఒక హత్య జరగుతున్నదని, లా అండ్ ఆర్డర్ మెయిన్‌టైన్ చేయడంలో ముఖ్యమంత్రి ఫెయిలయ్యారని ఫైర్ అయ్యారు. డీజీపీ అధికారికంగా విడుదల చేసిన లెక్క ప్రకారం గతేడాది కంటే 23% క్రైమ్ రేట్ పెరిగిందని చెప్పారని తెలిపారు. 15 నెలల పాలనలో 9 కమ్యూనల్ రైట్స్ అయ్యాయన్నారు. ఒకరోజే హైదరాబాద్‌లో రెండు అత్యాచార ఘటనలు రెండు హత్యలు జరిగాయని ఆరోపించారు. నగరంలో 50% సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిపారు. పోలీసులకు ఆత్యాధునిక వాహనాలు కొనిస్తే.. డీజిల్ పోయించే పరిస్థితిలో కూడా లేరని ఎద్దేవా చేశారు. పోలీస్ చరిత్రలో పోలీసు కుటుంబాలను పోలీసులతో అరెస్టు చేయించిన ఘనుడు సీఎం రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమనగల్‌లో ముఖ్యమంత్రి భూముల కోసం నాలుగు లైన్ల రోడ్లు రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్ ఉండగా మరో రోడ్డు ఎందుకు? అని ప్రశ్నించారు. 5,000 కోట్లు ఖర్చుపెట్టి 10 లైన్ల రోడ్డు ఎందుకు వేస్తున్నావ్ అని నిలదీశారు. తమకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టే తెలంగాణను నంబర్ 1గా నిలిపామని చెప్పారు. అందరూ ఒకటే అంటున్న ముఖ్యమంత్రి.. తమకు ఏసీడీపీ నిధులు కోరితే ఇవ్వడం లేదన్నారు. రూ.70 వేల కోట్లు గండి పడిందని చెబుతూనే.. 95 శాతం వాస్తవ బడ్జెట్ అని అంటున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములమ్మితే బొంద పెట్టడానికి కూడా స్థలం మిగలదని చెప్పి.. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా భూముల అమ్మకాన్ని సమర్ధిస్తున్నారని అన్నారు. గచ్చిబౌలిలోని 400 ఎకరాలను బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్లాడి కాపాడిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కోర్టు తీర్పు వచ్చిందని చెప్పారు.