జాతీయస్థాయి ఎస్జీఎఫ్ హ్యాండ్ బాల్ పోటీలలో జిల్లా క్రీడాకారుల ప్రతిభ

by Sridhar Babu |
జాతీయస్థాయి ఎస్జీఎఫ్  హ్యాండ్ బాల్ పోటీలలో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
X

దిశ, రామడుగు : మహబూబ్ నగర్ జిల్లాలో ఈనెల 10 నుండి 14 వరకు జరిగిన 68వ జాతీయస్థాయి ఎస్జీఎఫ్ అండర్ 17 బాల బాలికల జాతీయస్థాయి పోటీలలో కరీంనగర్ జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర జట్టు గోల్డ్ మెడల్ సాధించింది. జి. సుదీష్న,అక్షయ, యోగేశ్వరి,మామిడి సంజీవ్, రాగం ఈశ్వర్,మడ్డి వంశీ, విష్ణు తెలంగాణ జట్టు బంగారు పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించారని కోరపల్లి పీఈటీ జిట్ట వేణి శ్రీనివాస్ తెలిపారు.

గోల్డ్ మెడల్ సాధించడం పట్ల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు, ఎస్ జీఎఫ్ కార్యదర్శి బి.వేణుగోపాల్, డీవైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శి వడ్లూరి రాజేందర్, జిట్టబోయిన శ్రీను, అసోసియేషన్ ట్రెజరర్ కలిగేటి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి జెట్టిపల్లీ అశోక్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం టీఎస్ అధ్యక్ష కార్యదర్శులు అంతడుపుల శ్రీనివాస్, మహమ్మద్, యునిస్ పాషా, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నందెల్లి మహిపాల్, జనార్దన్ రెడ్డి, సీనియర్ పీడీలు సంపత్ రావు, కె. కృష్ణ, బాబు శ్రీనివాస్, గిన్ని లక్ష్మణ్ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed