- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పసుపు బోర్డు ఏర్పాటుపై నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
దిశ, ఆలూర్ : ఆలూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆలూర్ మండలం అధ్యక్షుడు సుర శ్రీకాంత్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి, ఎంపీ అరవింద్ ధర్మపురి, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ 30 దశాబ్దాల రైతుల కల పసుపు బోర్డు ఏర్పాటు అని, జిల్లాలో అధిక శాతం పసుపు రైతులు ఉండటం వారి కలను సహకారం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ పార్టీలోకి రాగానే మొట్ట మొదటగా పాదయాత్రగా జగిత్యాల నుండి నిజామాబాద్ జిల్లా మొత్తం తిరుగుతూ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట కోసం నరేంద్ర మోదీ తో మాట్లాడి జాతీయ పసుపు బోర్డు ను నిజామాబాద్ లో ఏర్పాటు చేసి సంక్రాంతి పండుగ కానుకగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంపీ అరవిందుకు ఆలూరు మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మొర్చ మండల అధ్యక్షులు ప్రళయతేజ్, బీసీ మోర్చా అధ్యక్షులు నాడీశరం మల్లయ్య, ఆలూర్ సీనియర్ నాయకులు గిరీష్, డాక్టర్ అరుణ్, యాదగిరి మహేష్, ఎర్రం రమేష్, సుభాష్ హరీష్,బార్ల మనీష్,రమేష్, మల్లయ్య,సతీష్,మహేష్, సాయి,రవి,కిషన్, తదితరులు పాల్గొన్నారు.