- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అదృశ్యమైన యువకుడి శవం లభ్యం
by Sridhar Babu |
X
దిశ, ఖమ్మం రూరల్ : అదృశ్యమైన యువకుడి శవంగా దొరికిన సంఘటన రూరల్ మండలంలో చోటుచేసుకుంది. ఈ నెల 13న రూరల్ మండలం రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన సంజయ్(22) నన్ను ఎవరో చంపుతున్నారంటూ తన అన్నకు వాయిస్ మెసేజ్ లు పెట్టి అదృశ్యమయ్యాడు. పండుగ రోజు అయిన మంగళవారం రఘునాథపాలెం మండలం తనికెళ్ల వద్ద సాగర్ ఎన్ఎస్పీ కాలువలో శవమై తేలాడు.
సంజయ్ మృతి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతుడి శవం వద్ద పురుగుమందు డబ్బా లభ్యమైనట్లు బంధువులు తెలిపారు. పూర్తి విచారణ తర్వాత మరణానికి గల కారణాలు వివరిస్తామని సీఐ రాజు తెలిపారు. లభ్యమైన శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Advertisement
Next Story