గత రికార్డులను బ్రేక్ చేసిన మహా కుంభమేళ.. 3.5 కోట్ల మంది పవిత్ర స్నానం

by Mahesh |
గత రికార్డులను బ్రేక్ చేసిన మహా కుంభమేళ.. 3.5 కోట్ల మంది పవిత్ర స్నానం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా సమ్మేళనానికి(Largest public gathering) మరోసారి భారత్ కేంద్రంగా నిలిచింది. దాదాపు 145 ఏళ్ల తర్వాత వచ్చిన పవీత్రమైన మహాకుంభమేళ(Mahakumbh Mela) జనవరి 13న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభం అయింది. దీంతో లక్షలాది మంది భక్తులు మకర సంక్రాంతి పండుగ సందర్భంగా "అమృత స్నానం" అని పిలిచే పవిత్ర స్నానం(Holy bath) చేయడానికి మంగళవారం ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమానికి తరలివచ్చారు. యూపీ ప్రభుత్వం(UP Govt) ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఏర్పాట్లు చేసింది.

దీంతో త్రివేణి సంగమం(Triveni Sangam)లో మంగళవారం ఉదయం ఎనిమిది గంటల వరకు కోటి మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ తెలిపింది. కాగా ఈ సంఖ్య మంగళవారం సాయంత్రానికి మొత్తం రెండు రోజుల్లో కలిపి 3.5 కోట్ల మంది పవిత్ర స్నానం ఆచరించినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా ఈ సంఖ్య ఇలానే కొనసాగితే ప్రభుత్వం అంచనా వేస్తున్న సంఖ్య కంటే మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా మహాకుంభమేళకు ఈ సారి 40 కోట్ల భక్తులు(40 crore devotees) వస్తారని ప్రభుత్వం అంచనాలు పెట్టుకొని ఏర్పాట్లు చేసింది.

Advertisement

Next Story

Most Viewed