Sunny Leone: క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్న సన్నీ లియోన్.. క్యూరియాసిటీ పెంచుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్

by Hamsa |
Sunny Leone: క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్న సన్నీ లియోన్.. క్యూరియాసిటీ పెంచుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్(Sunny Leone) పలు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ తన నటనతో అందరినీ మంత్రముగ్దులను చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ పలు హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారును మత్తెక్కిస్తోంది. ఇటీవల ఆమె ‘మందిర’ (Mandira)మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ‘త్రిముఖ’(Trimukha) అనే తెలుగు సినిమాతో రాబోతుంది. ఇందులో యోగేష్ కల్లే హీరోగా నటిస్తుండగా.. శ్రీదేవి మద్దాలి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. దీనిని అకీరా డ్రీమ్ క్రియేషన్స్(Akira Dream Creations) బ్యానర్‌పై హర్ష కల్లె నిర్మిస్తున్నారు.

ఇందులో నాజర్, ఆదిత్య శ్రీవాస్తవ్, సుమన్, మొట్ట రాజేంద్రన్, ప్రవీణ్, అషురెడ్డి(Ashu Reddy) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇప్పటికే ‘త్రిముఖ’ మూవీ షూటింగ్ పూర్తి కాగా.. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ ఏడాది చివరికల్లా విడుదల కానున్నట్లు సమాచారం. తాజాగా, సంక్రాంతి సందర్భంగా మూవీ మేకర్స్ ఈసినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సన్నీ లియోన్ షాక్‌లో ఉండగా.. అషు వేలు చూపిస్తూ బెదరిస్తూ కనిపించింది. అలాగే పోలీస్ స్టేషన్, పలు ఫొటో క్లిప్స్‌ను కూడా చూపించారు. ఇక వాటన్నింటినీ చూస్తుంటే.. ‘త్రిముఖ’ క్రైమ్ థ్రిల్లర‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

Advertisement

Next Story

Most Viewed