Kannappa: శివుని ఆజ్ఞతోనే ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.. హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Ramesh Goud |
Kannappa: శివుని ఆజ్ఞతోనే ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.. హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్ వంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ ఎంతో ఆకట్టుకోగా.. ఏప్రిల్ 25 గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే శుక్రవారం బెంగళూరులో ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరో విష్ణు మాట్లాడుతూ.. ‘‘కన్నప్ప’ ప్రమోషన్స్‌ను కన్నడ నేల నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉంది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మొదటి సారిగా కన్నప్ప చిత్రాన్ని చేశారు. ఆ తర్వాత శివ రాజ్ కుమార్, తెలుగులో స్వర్గీయ శ్రీ కృష్ణంరాజు బాపు రమణ దర్శకత్వంలో కన్నప్ప చేశారు. మళ్లీ ఇప్పుడు మేం ఈ కథను చెప్పబోతోన్నాం. ఈ తరానికి కన్నప్ప ఎవరు? ఆయన కథ ఏంటి? ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏంటి? అని క్లియర్‌గా చూపించాలనే ఈ కన్నప్ప సినిమాను చేస్తున్నాం. ముఖేష్ కుమార్ సింగ్ బుల్లితెరపై ఓ లెజెండ్. మహాభారతం సీరియల్‌ను అద్భుతంగా తెరకెక్కించారు. శివుని ఆజ్ఞతోనే ఈ చిత్రం ప్రారంభమైందని అనిపిస్తుంది. నాకు ఈ కన్నప్ప ఎంతో ప్రత్యేకం. ఆర్ఆర్ అవ్వక ముందే రాక్ లైన్ వెంకటేష్ ఈ మూవీని చూశారు. అద్భుతంగా వచ్చిందని భరోసానిచ్చారు. ఇక ఆ శివుని ఆశీస్సులతో మేం ఏప్రిల్ 25న రాబోతోన్నాము’ అని చెప్పుకొచ్చాడు.

Next Story