AP News : కర్నూల్ హాస్టల్ ఘటన... వార్డెన్ సస్పెండ్

by M.Rajitha |
AP News : కర్నూల్ హాస్టల్ ఘటన... వార్డెన్ సస్పెండ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని కర్నూలు జిల్లా(Kurnool district) కోడుమూరు ఎస్సీ హాస్టల్‌(SC Hostel Incident)లో తమ మాట వినలేదని 10వ తరగతి విద్యార్థులు 6వ తరగతి విద్యార్థులను బెల్ట్‌తో చితకబాదిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. హాస్టల్ లో విద్యార్థుల సంరక్షణ పట్ల నిర్లక్ష్యం వహించినందుకు హాస్టల్ వార్డెన్ ను కలెక్టర్ సస్పెండ్(Warden Supspended) చేశారు. ఈ ఘటన జరిగి 12 రోజులు గడిచినా ఎలాంటి విచారణ చేపట్టకుండా వార్డెన్ నిర్లక్ష్యంగా వహించారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వార్డెన్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సీ హాస్టల్‌లో తన మాట వినలేదని ఈనెల 11న 6వ తరగతి విద్యార్థులను 10వ విద్యార్థి దారుణంగా బెల్ట్‌తో చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆరో తరగతి విద్యార్థులను (SC hostel) హాస్టల్ గదిలో కింద పడేసి మరి బెల్ట్‌తో విపరీతంగా విద్యార్థి కొట్టాడు. జూనియర్ విద్యార్థులు తమను కొట్టవద్దని వేడుకున్నా కూడా సీనియర్ విద్యార్థి విచక్షణ కోల్పోయి వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు.

Next Story

Most Viewed