అల్లా బోధనలు సమాజానికి ఆదర్శం : మంత్రి జూపల్లి

by Aamani |
అల్లా బోధనలు సమాజానికి ఆదర్శం : మంత్రి జూపల్లి
X

దిశ,కొల్లాపూర్: అల్లా బోధనలు సమాజానికి ఆదర్శమని,అల్లా దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆయన రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. కొల్లాపూర్ పట్టణం వెలుపల ఖాద‌ర్ పాషా ఈద్గాలో సోమవారం రంజాన్‌ సామూహిక ప్రార్థనల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జూప‌ల్లి మాట్లాడుతూ.. రంజాన్‌ మాసం ఎంతో పవిత్రమైనది, అల్లా దయతో ప్రజాలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

మత సామరస్యానికి ప్రతీక రంజాన్‌ అని, అల్లా బోధనలు సమాజానికి ఆదర్శమన్నారు. సమాజానికి ఉపయోగపడే అల్లా బోధనలను ప్రతి ఒక్కరు పాటించవలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని, తెలంగాణ రాష్ట్రంలో సర్వమత సామరస్యంతో ఉందన్నారు. ఈద్గా వద్ద మత గురువును శాలువా కప్పి మంత్రి సన్మానించారు.అలాగే ఈద్గా నిర్వాహకులు మర్యాదపూర్వకంగా మంత్రి జూపల్లి కృష్ణారావు ను సైతం సన్మానించారు.అలాగే బీఆర్ ఎస్ తరుపున మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి,మాజీ జెడ్పీటీసీ కాటం జాంబులయ్య,మాజీ కౌన్సిలర్ కృష్ణమూర్తి ఈద్గా వద్ద ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో సోమశిల, కుడికిళ్ళ,చుక్కాయి పల్లి, సింగోటం,యన్మన్ బెట్ల,మొల చింతపల్లి,ఎల్లూర్,గ్రామాల్లోనూ ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఫయాజ్, ఇసూప్, మంత్రి జూపల్లి వెంట మాజీ జెడ్పీటీసీ హన్మంతు నాయక్,మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఇక్బాల్,మాజీ కౌన్సిలర్లు రహీం పాష, సిబ్బేది నరసింహారావు,నహీం,కాంగ్రెస్ నాయకులు రంగినేని జగదేశ్వరుడు, మేకల నాగరాజు,వంగ రాజశేఖర్ గౌడ్ తదితరులున్నారు.



Next Story