- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తండ్రైన రాహుల్.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన అతియా
by Harish |

X
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తండ్రయ్యాడు. అతని భార్య అతియా శెట్టి పండంటి ఆడబిడ్డకు సోమవారం జన్మనిచ్చింది. రాహుల్ దంపతులు సోషల్ మీడియా వేదికగా తమకు కూతురు పుట్టిందని వెల్లడించారు. దీంతో అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాలీవుడ్ నటి అతియా శెట్టిని రాహుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరు 2023లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మరోవైపు, ఐపీఎల్‌లో రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సోమవారం లక్నోతో జరిగిన తొలి మ్యాచ్‌కు రాహుల్ దూరంగా ఉన్నాడు. ప్రసవ సమయంలో భార్య వద్ద ఉండాలనే ఉద్దేశంతోనే రాహుల్ ఆ మ్యాచ్‌కు దూరయ్యాడు. ఈ నెల 30న హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా రాహుల్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
- Tags
- KL Rahul
Next Story