ప్రభుత్వ భూమలను కాపాడండి.. హైడ్రా ప్రజావాణికు పెద్ద ఎత్తున ఫిర్యాదులు

by Ramesh Goud |
ప్రభుత్వ భూమలను కాపాడండి.. హైడ్రా ప్రజావాణికు పెద్ద ఎత్తున ఫిర్యాదులు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ భూములకు కాపాడాలని సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణి (Hydra Prajavani)కి పెద్ద ఎత్తున ఫిర్యాదులు (Complaints) వచ్చాయి. హైదరాబాద్ (Hyderabad) లోని చెరువులు, కుంటలు, నాళాలు, ప్రభుత్వ భూముల రక్షణే ప్రధాన ధ్యేయంగా హైడ్రా (Hydra) పని చేస్తోంది. ఇందుకోసం హైడ్రా కార్యాలయంలో (Hydra Office) ప్రతీ సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి, సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తోంది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు హైడ్రా అధికారులు పరిశీలించి, విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం హైడ్రా ఆధ్వర్యంలో అధికారులు నిర్వహించిన ప్రజావాణికి 63 ఫిర్యాదులు అందాయి. ప్రజావ‌స‌రాల‌కు ఉద్దేశించిన భూమిని స్థానికంగా ప‌లుకుబ‌డి ఉన్న వ్యక్తులు క‌బ్జా చేసేస్తున్నార‌ని.. వాటిని కాపాడాల‌ని ప‌లువురు ప్రజావాణికి ఫిర్యాదు చేశారు.

పాఠ‌శాల‌కు, పిల్లలు ఆడుకునేందుకు ఉద్దేశించిన స్థలాల‌ను కూడా వ‌ద‌ల‌డంలేద‌ని అధికారుల ఎదుట వాపోయారు. ఫుట్ పాత్‌ల‌ను, స‌ర్వీసు రోడ్డుల‌ను వ‌ద‌ల‌కుండా తోపుడు బ‌ళ్ల నుంచి ఏకంగా డ‌బ్బాలు పెట్టేసి వ్యాపారాలు చేసుకుంటున్నార‌ని.. వాటిని తొల‌గిస్తే ప్రదాన ర‌హ‌దారుల‌కు ఆనుకుని ఉన్న నివాస ప్రాంతాల‌కు ఎంతో ఉప‌శ‌మ‌నంగా ఉంటుంద‌ని ఫిర్యాదులలో పేర్కొన్నారు. అంతేగాక చెరువుల్లో వ్యవ‌సాయం చేసుకోవ‌డానికి మాత్రమే ప‌రిమిత‌మ‌వ్వాల్సిన శిఖం భూముల‌లో ప‌క్కన ప‌ట్టా భూమి స‌ర్వే నంబ‌రు చూపించి అనుమ‌తులు తీసుకుని ఇళ్లు క‌ట్టేస్తున్నార‌ని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో తాము వ్యవ‌సాయ భూమిని కోల్పోవాల్సి వ‌స్తోంద‌ని రైతులు వాపోతున్నారు. ఇలా సోమవారం హైడ్రా నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 63 ఫిర్యాదులందాయని అధికారులు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.



Next Story

Most Viewed