- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Delhi govt: నీట్, సీఈయూటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

దిశ, నేషనల్ బ్యూరో: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET), నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఢిల్లీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్‌కు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, బిగ్ ఇన్‌స్టిట్యూట్, ఫిజిక్స్ వాలాతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేఖా గుప్తా, విద్యా మంత్రి ఆశిష్ సూద్ సమక్షంలో అగ్రిమెంట్ పై సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుండగా రోజుకు ఆరు గంటల చొప్పున విద్యార్థులకు 30 రోజుల పాటు ఆన్ లైన్ శిక్షణ ఇవ్వనున్నారు. సుమారు 1.63లక్షల మంది స్టూడెంట్‌కు కోచింగ్ అందనుంది.
కోచింగ్‌లో భాగంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ, మ్యాథ్స్, జనరల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ వంటి అంశాలు బోధించనున్నారు. అంతేగాక మాక్ టెస్టులు సైతం నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు పొందడంలో సహాయపడడమే ఈ ఫ్రీ కోచింగ్ లక్ష్యమని సీఎం రేఖా గుప్తా (Rekha guptha) తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్ చేసేందుకు మంచి కళాశాలల్లో చేరేందుకు అవకాశం కలుగుతుందన్నారు. అలాగే పేద విద్యార్థులు నీట్ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం లేదా ఉన్నత విద్య కోసం విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందడం సులభతరం అవుతుందని ఢిల్లీ విద్యా మంత్రి ఆశిష్ సూద్ తెలిపారు.