- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Sunil: ఎప్పటికైనా అతను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అవుతాడు.. ఆ స్టార్ హీరోపై సునీల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దిశ, సినిమా: టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీలో బెస్ట్ కమెడీయన్(Best Comedian)గా గుర్తింపు తెచ్చుకున్నవారిలో సునీల్ (Sunil) ఒకరు. సైడ్ యాక్టర్(Side actor)గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన.. ‘అందాల రాముడు’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత పలు చిత్రాలు తీసినప్పటికీ హీరోగా ఇండస్ట్రీలో రాణించలేకపోయాడు. ఇక రీసెంట్‌గా మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ (Second innings) స్టార్ట్ చేసిన సునీల్.. విలన్‌గా పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తూ తన క్రేజ్‌ను మరింత పెంచుకునే పనిలో పడ్డాడు. దీంతో ప్రజెంట్ వరుస సినిమాల్లో నటిస్తూ సందడి చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూ(Interview)లో పాల్గొన్న సునీల్ నేచురల్ స్టార్ నానిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
‘చిరంజీవి (Chiranjeevi) తర్వాత నాని(Nani)నే ఎన్ని పనులు ఉన్న వదిలేసుకుని మరీ ఆడియో లాంచ్(Audio launch)కు వస్తారని చెప్పారు’ అని యాంకర్ ప్రశ్నించగా.. ‘అవును.. నాని మంచి మనసే దానికి నిదర్శనం. నిజానికి తనకు రావాల్సిన అవసరం లేదు. సారీ అన్నా అని ఒక్కమాట చెప్పి వదిలేయొచ్చు. కానీ నాని అలా చెయ్యడు. ముందు రోజు ఇన్ని షాట్స్ ఉన్నాయి.. ఈ టైమ్‌కి అవుతాయి అని చెప్పి.. ఆ టైంకి షూటింగ్ ఫినిష్ చేసుకుని వస్తాను అని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈరోజుల్లో కూడా అలాంటి మనసు ఉన్న మనిషి ఉన్నారు అని ఒక పాజిటివ్‌గా ఫీల్ అయ్యాను. నిజానికి తను చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు అనుకున్నాను. తను యాక్టర్‌గా సినిమాలు చేస్తున్నప్పటికీ.. రాసిపెట్టుకోండి ఏరోజుకైనా తను పెద్ద సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అవుతాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.