- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణ పసుపు రైతులకు చరిత్రలో నిలిచిపోయే రోజు: కిషన్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో జాతీయపసుపు బోర్డును ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి (Sankranti) పర్వదినం వేళ నిజామాబాద్ (Nizamabad)లో జాతీయ పసుపు బోర్డు (National Turmeric Board) కార్యాలయాన్ని ఇవాళ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ (Piyush Goyal) ఢిల్లీ (Delhi) నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఆయన వెంట నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) కూడా ఉన్నారు. కాగా ఈ జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా ఆర్మూర్ జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత, పల్లె గంగారెడ్డి (Palle Rangareddy)ని కేంద్రం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇవాళ ఆయన బాధ్యతలను స్వీకరించిన విషయం తెలిసిందే.
కాగా నిజామాబాద్(Nizamabad)లో జాతీయ పసుపు బోర్డు(National Turmeric Board) ఏర్పాటుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆయన తన ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చారు. "మకర సంక్రాంతి శుభ సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ జాతీయ పసుపు బోర్డును ప్రారంభించారు. జాతీయ పసుపు బోర్డ్ ఏర్పాటు వల్ల ప్రపంచ మార్కెట్లో భారతీయ పసుపుకు ఉన్న విలువను నిర్ధారిస్తుంది. పసుపు ఉత్పత్తిలో మరిన్ని ఆవిష్కరణలు, విలువ జోడించడం కోసం మరింత మెరుగైన అవకాశాలను రైతులకు అందిస్తుంది. ఇది మార్కెట్లో సరఫరా సదుపాయాలను బలోపేతం చేసి, రైతులకు, వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను." అని రాసుకొచ్చారు.