- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారి దోపిడీకి పాల్పడిన ఇద్దరు రౌడీ షీటర్లు అరెస్ట్
దిశ, చార్మినార్ : దారి దోపిడీకి పాల్పడిన ఇద్దరు రౌడీ షీటర్లను ఛత్రినాక పోలీసులు అదుపులోకి తీసుకొని సోమవారం రిమాండ్ కు తరలించారు. ఛత్రినాక ఇన్స్పెక్టర్ కె.నాగేంద్ర ప్రసాద్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం... సుల్తాన్ షాహీ కి చెందిన రౌడీషీటర్లు బాగిడి ఆకాష్(25), దిలౌర్ అమర్జిత్ సింగ్ అలియాస్ రాజా(26)లు ఈ నెల 22వ తేదీన మహ్మద్ రహీముద్దీన్(70) అనే వృద్దుడు మొఘల్‌పురా ప్రభుత్వపాఠశాల మీదుగా నడుచుకుంటూ వెళుతుండగా కత్తితో బెదిరించి అతని వద్ద నుంచి రూ. 3500ల నగదును లాక్కొనని పరారయ్యారు. ఈ మేరకు బాధితుడు ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఛత్రినాక పోలీసులు అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న ఆకాష్, రాజాలను అదుపులోకి తీసుకొని సోమవారం రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుంచి రూ. వెయ్యి నగదుతో పాటు ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా నిందితుడు బాగిడి ఆకాష్ పై 14 కేసులు, అమర్జిత్ సింగ్ పై మూడు పాత కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసును ఛత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.