- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలి : మిర్యాలగూడ ఎమ్మెల్యే
by Aamani |
X
దిశ, మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని పలు ప్రధాన కూడలిలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోరారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని ఫ్లైఓవర్ నుంచి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు చేపట్టిన ట్రాఫిక్ నియంత్రణ అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య వల్ల అత్యవసర సేవలను ఉపయోగించుకో లేకపోతున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో ఇష్టారాజ్యంగా వాహనాలను పార్కింగ్ చేస్తున్నారని దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసు అధికారులు, వాహనదారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు, సీఐలు వీరబాబు, నాగార్జున, కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story