- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mahesh Kumar Goud: పుష్ప-2 సినిమాకు రాయితీలు ఇచ్చాం
దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్ ఘటన(Sandhya Theater Incident)ను ఎవరికి వారు ఇష్టానుసారం వాడుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పుడు కొత్తగా ఆంధ్ర, పాత ఆంధ్ర పార్టీలు తయారయ్యాయని ఎద్దేవా చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమాకు ప్రభుత్వం రాయితీలు ఇచ్చిందని గుర్తుచేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని అన్నారు. సంధ్య థియేటర్ ఘటనను ఎవరూ రాజకీయం చేయొద్దని సూచించారు.
అంతకుముందు.. అంబేద్కర్‌పై పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. తక్షణం కేంద్ర కేబినెట్ నుంచి అమిత్ షాను తొలగించాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలతో అంబేద్కర్ పట్ల బీజేపీ వైఖరి మరోసారి బహిర్గతమైందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు అత్యున్నత వ్యవస్థ అని తెలిపారు. బీజేపీ కుట్రపూరితంగా రాహుల్ గాంధీ క్యారెక్టర్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.