MLC Kavitha : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ నడిపిస్తోంది : ఎమ్మెల్సీ కవిత

by M.Rajitha |   ( Updated:2024-12-23 14:21:02.0  )
MLC Kavitha : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ నడిపిస్తోంది : ఎమ్మెల్సీ కవిత
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఎమ్మెల్సీ కవిత తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ దాన్ని బీజేపీ పార్టీ నడిపిస్తున్నదని ఆరోపించారు. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)పై కేసు నమోదు చేయడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని మరోసారి రుజువయ్యిందని స్పష్టం చేశారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బీజేపీ పెద్దలను కలిసిన తర్వాతే కేటీఆర్ పై ఏసీబీ(ACB) కేసు నమోదు చేసిందని తెలిపారు. ఏసీబీ కేసు నమోదు చేసిన మరునాడే ఈడీ(ED) కేసు నమోదు చేసిందని, దీన్ని బట్టి చూస్తే ఆ రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. ప్రాంతీయ పార్టీలు ఉండకుండా చేయాలన్నది కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి చేస్తున్న కుట్ర అని తెలిపారు. ముఖ్యంగా కేసీఆర్(KCR) వంటి బలమైన నాయకులను దెబ్బకొట్టాలని ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, కానీ వాటికి సాధ్యంకాదని తేల్చిచెప్పారు. కక్షసాధింపులో భాగంగానే కేటీఆర్ పై ఏసీబీ, ఈడీ కేసు నమోదు చేశాయని, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నందునే కేటీఆర్‌ను టార్గెట్ చేశారని చెప్పారు.


Read More..

Ponnam: గురుకుల పాఠశాలలో మంత్రి పొన్నం ఆకస్మిక తనిఖీ

Advertisement

Next Story

Most Viewed