VIRAL VIDEO: మెట్రోలో తన వెనుకే కూర్చొని.. అలాంటి నిర్వాకం చేస్తున్న యువకుడు.. లాస్ట్‌కు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మహిళ

by Kavitha |
VIRAL VIDEO: మెట్రోలో తన వెనుకే కూర్చొని.. అలాంటి నిర్వాకం చేస్తున్న యువకుడు.. లాస్ట్‌కు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మహిళ
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి మెట్రోలో జరుగుతున్న వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. వ్యూస్, లైక్స్ కోసం కొందరు దిగజారి మరీ పొట్టి బట్టలు వేసుకుని డాన్స్ చేయడం, రొమాన్స్ చేయడం లాంటి చిత్ర విచిత్ర చేష్టలతో తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడుతుంటారు. మరికొన్నిసార్లు ఆకతాయిలు అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసి ఆటపట్టించే ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. విచిత్రమైన వస్త్రధారణలో ఉన్న మహిళ మెట్రో రైల్లో ప్రయాణిస్తుంది. అలా ప్రయాణికుల మధ్యలో నిలబడి ఉన్న ఆమెను.. అంతా విచిత్రంగా చూస్తున్నారు. అయితే ఇంతలో అటు పక్కనే కూర్చున్న ఓ యువకుడు తన ఫోన్‌లో ఆమెను వీడియో తీస్తుంటాడు. కాసేపటికి అతడు వీడియో తీస్తున్నాడనే విషయాన్ని గమనించిన సదరు మహిళ.. సడన్‌గా అతడి వద్దకు వెళ్లి కోపంతో చెంప ఛెళ్లు మనేలా కొట్టి.. ''నన్ను ఎందుకు వీడియో తీస్తున్నావ్''.. అని అడుగుతుంది.

దీంతో ఆ యువకుడు తానేమీ వీడియో తీయలేదంటూ ఆమెతో వాగ్వాదానికి దిగుతాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య చాలా సేపు వాగ్వాదం నడుస్తుంది. వీరి గొడవ చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కవుతారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. అది చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కాగా ఈ వీడియోకు ప్రస్తుతం 79 వేలకు పైగా లైక్స్‌లు వచ్చాయి.

(video link credits to ketlingro instagram id)

Next Story

Most Viewed