స్ట్రీట్ డ్యాన్స్‌లో ఇర‌గ‌దీసిన చిన్నారి.. నెట్టింట్లో నో సౌండ్‌! (వీడియో)

by Sumithra |
స్ట్రీట్ డ్యాన్స్‌లో ఇర‌గ‌దీసిన చిన్నారి.. నెట్టింట్లో నో సౌండ్‌! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః స్వేచ్ఛ‌కు మారుపేరు చిన్నారులు. కొత్త‌గా ఏది చూసినా అనుకరించాల‌ని అనుకునే అమాయ‌కులు. అయితే, కొంద‌రు చిన్నారుల్లో వికృత రూపాల‌ను చూసి భ‌య‌మేస్తుంది. కానీ, ఈ వీడియోలో ఉన్న చిన్నారి మాత్రం ప్ర‌త్యేకం. వీధి కళాకారులతో కలిసి ఒక చిన్న అమ్మాయి ఉత్సాహంగా చేస్తున్న స్ట్రీట్ డ్యాన్స్ వీడియో ట్విట్టర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ వీడియోలో, కర్ణాటకలోని ఉడిపికి చెందిన‌ జానపద నృత్యం చేస్తున్న కొంతమంది వీధి కళాకారులతో ఈ పాప‌ చేరింది. వీడియోలో మొదట ఈ చిన్న పాప అక్క‌డి వీధి నర్తకుణ్ణి పూలమాల వేసి గౌరవిస్తుంది. త‌ర్వాత‌, ఆ క‌ళాకారుడు చిన్నారిని తనతో కలిసి డ్యాన్స్ చేయమని ఆహ్వానిస్తూ, డ్యాన్స్‌తో ప్రోత్సహిస్తాడు. కొన్ని సెకన్ల తర్వాత, ఈ పాప గాడిలోకి దిగి, డ్యాన్సర్లను అనుకరిస్తూ ఉత్సాహంతో నృత్యం చేస్తుంది. ఈ వైరల్ క్లిప్‌ను విజిట్ ఉడుపి (@VisitUdupi) అనే టూరిజం పేజీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. మీరూ చూడండి!

దేశ ప్ర‌ధాని ఎవ‌రంటే ఈ విద్యార్థి ఆన్సర్ అదిరిపోయింది! (వీడియో)



Next Story

Most Viewed