Trending: పొరపాటున పదేళ్ల జైలు శిక్ష.. చికాగో ఫెడరల్ జూరీ కోర్టు సంచలన తీర్పు

by Shiva |
Trending: పొరపాటున పదేళ్ల జైలు శిక్ష.. చికాగో ఫెడరల్ జూరీ కోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: వంద మంది దోషులు శిక్ష నుంచి తప్పించుకున్నా పరవాలేదు.. కానీ ఏ నిర్దోషికి శిక్ష పడకూదనే సూత్రాన్ని న్యాయ‌స్థానాలు బలంగా నమ్ముతాయి, పాటిస్తాయి. కానీ, ఓ హత్య కేసులో పొరపాటున వ్యక్తికి పదేళ్ల పాటు జైలు శిక్ష పడగా.. చికాగో ఫెడరల్ జూరీ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. మార్సెల్ బ్రౌన్ అనే వ్యక్తిని ఓ హత్య కేసులో నిందితుడిగా పరిగణిస్తూ కోర్టు అతడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. కాగా, 2018లో అతడి తరఫు న్యాయవాదులు తిరిగి సరైన సాక్ష్యాధారాలను సమర్పించడంతో ఏడేళ్ల తరువాత కోర్టు అతడిని తాజాగా నిర్దోషిగా విడుదల చేసింది. ఈ క్రమంలో అతడికి జరిగిన అన్యాయాన్ని సరదిద్దుతూ ప్రభుత్వం అతడికి రూ.345 కోట్లను పరిహారంగా ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story