జెండా ఎగరేసి.. పయనమైన అధికారులు

by Aamani |
జెండా ఎగరేసి.. పయనమైన అధికారులు
X

దిశ,వెబ్ డెస్క్ : రజాకారుల నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి చెందిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు జాతీయ పతాకావిష్కరణ చేయాలని ప్రకటించింది. కానీ ఉన్నత అధికారుల పర్యవేక్షణ బాగా లేక మండలంలోని రాజుపల్లి, గ్రామంలో జాతీయ పతాకావిష్కరణ చేయలేదు. మరికొన్ని గ్రామపంచాయతీలో జెండా ఎగురవేసి పంచాయతీ కార్యదర్శులు ఇంటికి పయనమైన ఘటన శాయంపేట మండలం కాట్రపల్లి, నూర్జాన్ పల్లి, సాధన పల్లి, వసంతాపూర్, అప్పయ్యపల్లి గ్రామాల్లో చోటుచేసుకుంది. పలు గ్రామపంచాయతీలలో ప్రత్యేక అధికారి పాల్గొనలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.

కొన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారి ఎవరు తెలియదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు పనితీరు పట్ల ఉన్నతాధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్ల అధికారులు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి పెట్టి పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చూడాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై స్థానిక ఎంపీడీవో పని చంద్రని వివరణ కోరగా రాబోవు స్థానిక ఎలక్షన్ లో అధికారులు ఓటరు జాబితా పై నిమగ్నమయ్యారని అన్నారు. రాజుపల్లి గ్రామపంచాయతీలో జెండా ఎందుకు ఎగురవేయలేదు అని అడగగా పంచాయతీ కార్యదర్శి ఆరోగ్య పరిస్థితి బాగా లేనందున హాజరు రాలేదని పేర్కొన్నాడు.

Advertisement

Next Story

Most Viewed