- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టాలీవుడ్ నటుడు సుబ్బరాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా..? స్రవంతి బ్యాక్‌గ్రౌండ్ ఇదే..!
దిశ, సినిమా: కొన్ని సినిమాల్లో విలన్‌గా మరికొన్ని చిత్రాల్లో కమెడియన్‌గా నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సుబ్బరాజు అందరికీ తెలిసిందే. ఇక ఈయన తన 47 ఏళ్ల వయసులో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. తన భార్యతో దిగిన పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫైనల్‌గా పెళ్లి చేసుకున్నానంటూ తెలిపాడు. దీంతో వీరిద్దరి మ్యారేజ్ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే తాను పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు కానీ, తనకు సంబంధించిన మరే విషయాలు కానీ సుబ్బరాజు వెల్లడించలేదు. దీంతో ఆమె ఎవరు..? అసలు సుబ్బరాజు భార్య బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? అని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వెతికేశారు. ఈ క్రమంలో ఆమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. మరి అవేంటో మనం ఇప్పుడు చూద్దాం..
సుబ్బరాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు స్రవంతి. ఆమె అమెరికాలోని ఫ్లోరిడాలో డెంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. కొలంబియా యూనివర్సిటీ, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నుంచి బీడీఎస్, డీడీఎస్, ఎంపీహెచ్ డిగ్రీలు పొందారు. ఆమె ఒక ఫిట్‌నెస్ ఫ్రీక్. సైన్స్ పట్ల విపరీతమైన మక్కువ. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నార్త్‌వుడ్ డెంటల్ సెంటర్స్‌లో డెంటిస్ట్‌గా సుబ్బరాజు భార్య స్రవంతి వర్క్ చేస్తున్నారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. తన ఫస్ట్ లవ్ సైన్స్ అని, మ్యారీడ్ టు ఫిట్‌నెస్ అని ఆమె తన ఇన్‌స్టా బయోలో మెన్షన్ చేశారు. అమెరికాలో ఫ్లోరిడాలో స్రవంతి కుటుంబం స్థిరపడినట్లు తెలిసింది.
ఎలాంటి హడావుడి లేకుండా, ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలని ఈ జంట భావించింది. హైదరాబాద్‌లో అయితే సినీ రంగానికి చెందిన వారిని, ప్రముఖులను పిలవక తప్పదు, పిలవకపోవడం పద్ధతి కాదు. సుబ్బరాజు సొంతూరు భీమవరంలో పెళ్లి చేసుకున్నా దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంటుంది. అందుకే.. అట్టహాసంగా చేసుకునే పెళ్లిళ్లపై అంత ఆసక్తి లేని సుబ్బరాజు, స్రవంతి అమెరికాలోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అత్యంత సన్నిహితులను మాత్రమే పెళ్లికి పిలుచుకున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.