ఎంపీడీఓ కారు అద్దాలు ధ్వంసం..!

by Aamani |
ఎంపీడీఓ కారు అద్దాలు ధ్వంసం..!
X

దిశ, మరిపెడ :మహాబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల ఎంపీడీఓ రామారావు కారు అద్దాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.ఎంపీడీఓ తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కలెక్టరేట్ లో మీటింగ్ ఉన్న నేపథ్యంలో గురువారం రాత్రి ఉగ్గంపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో కారు పార్క్ చేసి తన మిత్రుని కారులో కలెక్టరేట్ కు వెళ్లి అక్కడి నుంచి ఖమ్మం వెళ్ళానని శుక్రవారం ఉదయం వచ్చి చూసే సరికి కారు వెనుక భాగం అద్దం పెద్ద బండరాయితో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు అని దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ చేయనున్నట్లు వారు తెలిపారు.

Advertisement

Next Story