Gambhir : కొన్ స్టాస్ కు భారత కెప్టెన్ తో మాట్లాడే హక్కు లేదు : గంభీర్

by Y. Venkata Narasimha Reddy |
Gambhir : కొన్ స్టాస్ కు భారత కెప్టెన్ తో మాట్లాడే హక్కు లేదు : గంభీర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియా యువ ఆటగాడు సామ్ కొన్ స్టాస్(Sam Konstas) ప్రవర్తనను భారత్ జట్టు క్రికెట్ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్(Gambhir)తీవ్రంగా తప్పుబట్టారు. అస్ట్రేలియా ఇండియా(Australia vs India) బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ ఐదవ..ఆఖరి టెస్టులో ఓడిపోయి సిరీస్ ను 3-1తో ఇండియా కోల్పోయింది. సిడ్నీ వేదికగా ముగిసిన ఆఖరి టెస్టు మ్యాచ్ అనంతరం గంభీర్ మీడియాతో మాట్లాడుతూ మ్యాచ్ లో భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాJasprit Bumrahతో ఆస్ట్రేలియా యువ ఆటగాడు సామ్ కొన్ స్టాస్ వ్యవహరించిన తీరు సరైంది కాదని నిందించాడు. 19 ఏళ్ల యువ ఆటగాడైన అతను భారత కెప్టెన్‌తో మాట్లాడే "హక్కు" లేదని చెప్పాడు.

సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో ఆసీస్ యువ ఆటగాడు సామ్ కొన్ స్టాస్ వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బంతికే ఉస్మాన్ ఖావాజాను బుమ్రా ఔట్ చేశాడు. దీంతో భారత ఆటగాళ్ల కొన్స్ వైపు చూస్తూ సంబరాలు చేసుకున్నారు. వీటిపై ఆసీస్ కోచ్ మెక్డొనాల్డ్ స్పందిస్తూ.. 'భారత ఆటగాళ్ల సంబరాలు కాస్త భయపెట్టేలా ఉన్నాయి' అని వ్యాఖ్యానించాడు. వాటిపై గౌతమ్ గంభీర్ మీడియా సమావేశంలో స్పందించారు. "కఠినమైన క్రీడలో సున్నితంగా ఉండలేరని.. అలాగని ఎవరూ బెదిరింపులకు దిగబోరన్నారు. ఈ విషయంలో కొన్ స్టాస్ కు మాట్లాడే హక్కే లేదన్నారు.

బుమ్రా, ఉస్మాన్ ఖవాజా సంభాషించుకుంటున్నప్పుడు మధ్యలో అతడు వెళ్లాల్సిన అవసరం లేదని, బ్యాటింగ్ కోసం స్ట్రైకింగ్ లో ఉన్న ఆటగాడు..అంపైర్, బౌలర్ మాత్రమే మాట్లాడుకొనే అంశమి..అది కొన్స్ పని కాదని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఓటమి బాధాకరమని..సుదీర్ఘ ఫార్మాట్ లో నిబద్ధతతో ఆడాలనుకుంటే దేశావాళీ క్రికెట్ ను ఆటగాళ్లు మరిచిపోకూడదన్నారు. జట్టులోని ప్రతి ఒక్కరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని కోరుకుంటానని.. వారు అందుబాటులో ఉన్నప్పుడు తప్పకుండా ఆడాలని సూచించారు. జట్టులోని ఆటగాళ్లందరిని తాను సమానంగా చూస్తానని స్పష్టం చేశాడు.

Advertisement

Next Story

Most Viewed