ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మహిళా ఓటర్లే అధికం..

by Sumithra |
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మహిళా ఓటర్లే అధికం..
X

దిశ, నల్లగొండ బ్యూరో : త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఓటర్ల సంఖ్యను అధికారులు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. మూడు జిల్లాల్లోనూ మహిళా ఓటర్ల సంఖ్యనే అధికంగా ఉంది. స్థానిక ఎన్నికల్లో మహిళా ఓట్లే కీలకం కానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా ఓట్లను రాబట్టేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు వారికి అనేక తాయిలాలు ప్రకటించే అవకాశం ఉంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య 1770 కాగా సుమారు 15,578 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డుకు ఒక పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేసే విషయం అందరికీ తెలిసిందే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఓటర్ల సంఖ్య 22,72,213 మంది ఉన్నారు.. అందులో మహిళా ఓటర్లు 11,48,824, పురుష ఓటర్లు 11,23,312, ఇతర ఓటర్లు 63 మంది ఉన్నారు.

సూర్య పేట జిల్లాలో అత్యధిక ఓట్లు కలిగిన మొదటి మూడు మండలాల్లో గరిడేపల్లి, మోతె, మునగాలలో ఉన్నాయి. వీటిలో కూడా మహిళా ఓటర్లు అధికం.

యాదాద్రి జిల్లాలో గ్రామ పంచాయతీలు 428 కాగా, వార్డులు 3798 ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 5,20,441 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళా ఓటర్లు 26,1205 కాగా పురుషులు 25,9233 మంది ఉన్నారు. ఇతరులు ముగ్గురున్నారు. మొత్తంగా ఓటర్ల సంఖ్య 5,20,441 ఉన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధిక ఓట్ల సంఖ్య కలిగిన మండలాలలో మొదటి స్థానం వలిగొండ, రెండో స్థానం రామన్నపేట, మూడో స్థానం బీబీనగర్ మండలాలు ఉన్నాయి. అయితే ఈ మూడింటిలో కూడా మహిళా ఓటర్ల సంఖ్యనే అత్యధికంగా ఉంది.

నల్లగొండ జిల్లాలో గ్రామ పంచాయతీలు 856 కాగా 7392 వార్డులున్నాయి. నల్లగొండ జిల్లాలో 10,59,261మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళా ఓటర్లు 5,34,986, పురుష ఓటర్లు 5,24,222, ఇతరులు 53 మంది ఉన్నారు.

నల్గొండ జిల్లాలో అత్యధిక ఓట్ల సంఖ్య కలిగిన మొదటి మూడు మండలాలు మిర్యాలగూడ, నార్కట్పల్లి , గుండ్లపల్లి మండలాలు ఉన్నాయి. అయితే ఈ మూడింటిలో కూడా మహిళా ఓటర్ల సంఖ్యని అధికంగా ఉంది.

పండుగ తర్వాత ఎపుడైనా..

గ్రామపంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగిసి దాదాపు 11 నెలలు కావస్తుంది. నాటి నుంచి ఇప్పటివరకు ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీలు ఉన్నాయి. అయితే పంచాయతీలకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుదల కావు. ఇప్పటికే ఏడాది కాలంగా నిధులు లేకపోవడం వల్ల పల్లెలన్నీ సమస్యలకు నిలయాలుగా మారాయి. అంతే కాకుండా మార్చి నెల నుంచి దాదాపు ఏప్రిల్ చివరి వరకు విద్యార్థుల వార్షిక పరీక్షలు, ఆ తర్వాత నిరుద్యోగులకు పోటీ పరీక్షలు వరుసగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానిక సంస్థలను వాయిదా వేసే అవకాశం లేదు.

అందువల్లే సంక్రాంతి పండుగ తర్వాత ఏ క్షణంలోనైనా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్ల పల్లెల్లో ఇప్పటికే రాజకీయ వాతావరణం కనిపిస్తుంది. సంక్రాంతి పండుగ నుంచి అది మరింత రాజుగా మారే అవకాశం ఉంది. అయితే అధికారులు ఇప్పటికే గ్రామపంచాయతీ ఓట్ల సంఖ్య పోలింగ్ బూతుల గుర్తింపు, గుర్తులను కూడా పూర్తిగా సిద్ధం చేసి ఉంచినట్లు సమాచారం. ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రం సర్వం సిద్ధమైనట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed