IT Raids: ఏపీ, తెలంగాణలో ఐటీ సోదాల కలకలం.. అసలు ఏం జరిగిందంటే?

by Shiva |   ( Updated:2025-01-08 07:01:54.0  )
IT Raids: ఏపీ, తెలంగాణలో ఐటీ సోదాల కలకలం.. అసలు ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా (Principal Secretary PK Mishra) కుమార్తె, అల్లుడుగా నటించి ప్రజలను మోసం చేశారన్న ఆరోపణలపై తాజాగా ఓ యువ జంటను ఒడిశా పోలీసులు భువనేశ్వర్‌లో అదుపులోకి తీసుకున్నారు. అయితే, అరెస్ట్ అయిన వారు హన్సితా అభిలిప్సా (38), ఆమె సహచరుడు అనిల్ కుమార్ మొహంతిగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. కేంద్రంలోని బడా నేతలతో తమకు సంబంధాలు ఉన్నాయంటూ మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా (Principal Secretary PK Mishra) కూతురు, అల్లుడి పేరుతో హన్సిక, అనిల్ కలిసి పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు, మైనింగ్ ఆపరేట్లను మోసం చేశారు.

ప్రభుత్వ పనుల పేరిట పలు కంపెనీలకు సుమారు రూ.100 కోట్లకు పైగా టోకరా వేశారు. కొంతకాలం వారిద్దరూ ఎవరికీ చిక్కకుండా లగ్జరీ కార్లు, విల్లాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన ఓడిశా పోలీసులు హన్సిక, అనిల్ కుమార్ అరెస్ట్ చేశారు. వారిపై BNS సెక్షన్లు 329(3), 319(2), 318(4), మరియు 3(5) కింద కేసు నమోదు చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana)లోని నాలుగు చోటల ఐటీ అధికారులు ఏక కాలంలో 12 చోట్ల సోదాలు చేపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed