- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Mystery Temple: అక్కడ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ కు పూజలు.. మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్న భక్తులు
దిశ, వెబ్ డెస్క్ : మనకి ఖాళీ సమయం దొరికితే కంచి నుంచీ.. కాశ్మీర్ వరకూ.. అన్నీ చుట్టేసి వస్తాము. దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత.. అక్కడే ప్రసాదం స్వీకరించి.. కొంత సేపు కూర్చొని తిరిగి వెళ్తుంటాం. అయితే, ఆ టెంపుల్స్ వెనక అంతు చిక్కని ఎన్నో రహస్యాలుంటాయి. వాటిన ఛేదించేందుకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. దేవ దేవుళ్లు నడిచిన ఈ పవిత్ర భూమి పై ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కాకపోతే అన్ని గుళ్లూ ఒకేలా ఉండవు. కొన్ని వింతగా ఉంటే మరి కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. కొన్నైతే అసలు నమ్మశక్యంగా ఉండవు.
ఇండియాలో సాధారణంగా విగ్రహాలను, ఆవులను, చెట్లనూ పూజించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే, బుల్లెట్‌ని దేవుడిలా భావించి విగ్రహం పెట్టడం ఎక్కడైనా చూశారా ..? ఇది మీకు వినడానికి షాకింగ్ గా ఉన్నా .. అలాంటి వింత గుడి.. రాజస్థాన్‌లోని జోధపూర్‌లో ఉంది. ఇక్కడ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను భక్తులు పూజిస్తారు. అంతటితో ఆగకుండా మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా పూజ చేస్తే, రోడ్డు ప్రమాదాలు జరగకుండా.. దేవుడు కాపాడతాడని ఈ గ్రామస్థుల నమ్మకం.
అయితే, దీని వెనక ఓ చిన్న కథ ఉంది. " గతంలో ఈ బైక్ నడిపిన వ్యక్తి .. ఈ గుడిని నిర్మించిన ప్లేస్‌లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అయితే, పోలీసులు బైక్‌ని తీసుకెళ్లి పెట్టుకున్నారు. ఐతే.. మరునాడు .. ఆ బైక్.. తిరిగి అదే ప్లేస్‌లో కనిపించింది. షాక్ అయి షేకైనా పోలీసులు.. ఏం చేయాలో తెలియక మళ్లీ బైక్‌ని తీసుకెళ్లి.. ఈసారి గొలుసులతో గట్టిగా కట్టేశారు. అయినా సరే .. తర్వాత రోజు .. ఆ బైక్.. అదే ప్లేస్‌లోకి వచ్చింది. ఇలా ఎన్నో సార్లు జరగడంతో.. విసుగు చెందిన పోలీసులు.. అక్కడే వదిలేశారట. ఇక అప్పటి నుంచి ఈ బైక్‌ని పూజిస్తూ.. బుల్లెట్ బాబా అని పేరు పెట్టి ఆ ఊరు గ్రామస్తులు గుడి నిర్మించారని" భక్తులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.