Virat Kohli : నా ఫ్యామిలీ మొత్తం కోహ్లీని ఇష్టపడతారు.. సామ్ కొన్‌స్టాస్

by Sathputhe Rajesh |
Virat Kohli : నా ఫ్యామిలీ మొత్తం కోహ్లీని ఇష్టపడతారు.. సామ్ కొన్‌స్టాస్
X

దిశ, స్పోర్ట్స్ : తన ఫ్యామిలీ మొత్తం కోహ్లీని ఇష్టపడతారని ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మెన్ సామ్ కొన్‌స్టాస్ అన్నాడు. బుధవారం ఈ మేరకు కొన్‌స్టాస్ కోడ్ స్పోర్ట్స్‌తో మాట్లాడాడు. ‘ఎంసీజీ టెస్ట్ మ్యాచ్ తర్వాత కోహ్లీతో కాసేపు మాట్లాడాను. తనను ఆరాధిస్తా అని కోహ్లీతో చెప్పా. అతడితో కలిసి ఆడటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. మా ఫ్యామిలీ మొత్తం కోహ్లీని ఇష్టపడతాం. అతను లెజెండ్. విరాట్ బ్యాటింగ్‌కు రాగానే ప్రేక్షకులు అతడి పేరును జపించారు. కిందిస్థాయి నుంచి కోహ్లీ ఎదిగారు. శ్రీలంక టూర్‌‌కు ఎంపికైతే బాగా ఆడాలని విష్ చేశాడు.’ అని కొన్‌స్టాస్ అన్నాడు. ఇదే మ్యాచ్ సందర్భంగా కొన్‌స్టాస్‌కు భుజం తాకడంతో కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story