విత్తన చట్టం పలు తీర్మానాలపై చర్చ

by Naveena |
విత్తన చట్టం పలు తీర్మానాలపై చర్చ
X

దిశ, ఆర్మూర్ : హైదరాబాద్ లోని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అధ్యక్షతన విత్తన సమస్యలు, రైతు ప్రయోజనాలు అనే అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. విత్తన చట్టం పలు తీర్మానాల మీద అఖిలపక్ష సమావేశంలో చర్చించినట్లు అన్వేష్ రెడ్డి తెలిపారు. అఖిలపక్ష సమావేశంలో విత్తన చట్టం అవసరం ఉన్న ఆవశ్యకతను వివరించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ,అధికారులు, అఖిలపక్ష నాయకులు, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story