- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ముగ్గురు మృతికి కారణమైన ఆటో డ్రైవర్ అరెస్ట్
దిశ, బోథ్ : అతిగా మద్యం సేవించి ఆటో నడిపి ముగ్గురు మృతికి కారణమైన బజార్ హత్నూర్ మండలం దేగామ గ్రామానికి చెందిన పాలెపు రాకేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 7వ తేదీన ఆటోడ్రైవర్ పాలెపు రాకేష్ అతిగా మద్యం సేవించి తన ఆటోలో పరిమితికి మించి 11 మంది ప్రయాణికులను ఎక్కించుకోవడంతో ఆటో బోల్తా పడింది.
దాంతో ఆటోలో ప్రయాణిస్తున్న గిర్నూరు గ్రామానికి చెందిన అన్నెల అడెల్లి అను అక్కడికక్కడే మృతి చెందింది. మరికొంతమందికి గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించగా మైలారపు అరుణ్, ఐల ఆశన్న చికిత్స పొందుతూ మరణించారు. గాయపడిన మిగతా ప్రయాణికులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనలో బజార్ హత్నూర్ పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు.