ఖాళీ అవుతున్న అవ్వగారి చెరువు

by Kalyani |
ఖాళీ అవుతున్న అవ్వగారి చెరువు
X

దిశ, పర్వతగిరి: మండల కేంద్రంలోని అవ్వ గారి చెరువు ఖాళీ అవుతుందని, వెంటనే ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నీళ్లను చెరువులోకి వదలాలని రైతులు కోరుతున్నారు. అలాగే మండల పరిధిలోని కల్లెడ గ్రామ రెవెన్యూ పరిధిలోని ఆవకుంట లోని నీరు కూడా అడుగంటి పోయాయని సంబంధిత అధికారులు మండల కేంద్రంలోని అవ్వ గారి చెరువును నింపి కట్టు కాల్వ ద్వారా ఆవకుంటలోకి నీరు వచ్చే విధంగా చూడాలని రైతులు కోరుతున్నారు.


ఎస్సారెస్పీ నీరు విడుదల చేయాలి పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన చిరబోయిన రాజు మత్స్యశాఖ సభ్యుడు మాట్లాడుతూ… మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవ్వ గారి చెరువును కౌలుకు తీసుకున్నానని, ప్రభుత్వం అందించిన చేప పిల్లలతో పాటు బయట కొనుగోలు చేసిన చేప పిల్లలను కూడా చెరువులో వదిలానని, చేపల సైజు పెరగకముందే చెరువులో నీరు ఖాళీ అవడం ఆందోళన కలిగిస్తుందని, అలాగే చెరువు శివారు రైతులు కూడా నీటికి ఇబ్బంది పడవలసి వస్తుందని, వెంటనే సంబంధిత అధికారులు ఎస్సారెస్పీ కెనాల్ నీళ్లను చెరువులోకి విడుదల చేయాలని కోరాడు.

చెరువు నింపి కాలువ ద్వారా నీరు విడుదల చేయాలి -రైతు కొల్లూరి స్వామి


మండల కేంద్రానికి చెందిన రైతు కొల్లూరి స్వామి మాట్లాడుతూ... గత ప్రభుత్వం ఈ ప్రాంత రైతులను దృష్టిలో పెట్టుకొని దాదాపు రూ. 20 లక్షలకు పైగా నిధులు ఖర్చు చేసి, కట్టు కాలువ పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. గత సంవత్సరం అవ్వగారు చెరువు నింపి, కట్టుకాల్వ ద్వారా నీటిని కల్లెడ శివారులోని ఆవకుంటకు నీటిని పంపడం ద్వారా ఆవకుంట రైతులతోపాటు, దాదాపు కిలోమీటర్ కలిగిన కాలువ ఇరుప్రక్కల బోరు బావులలో నీరు పెరిగి, రైతులకు ఇబ్బంది లేకుండా పంటలు పండించుకున్నామని అన్నాడు. ఈ సంవత్సరం కూడా ఎస్సారెస్పీ కాల్వ ద్వారా నీటిని అవ్వగారు చెరువును నింపి, కట్టు కాల్వ ద్వారా నీళ్లను విడుదల చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.

Advertisement

Next Story