- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యువరాజుకు మతిభ్రమించింది : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పై మరోసారి నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy). నేడు గాంధీ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ దేశం కోసం యుద్ధం చేసిన సైనికుడు కాదని, ఆయన ఒక యువరాజని ఎద్దేవా చేశారు. మరోసారి తెలంగాణ ప్రజలకు చెవిలో పువ్వు పెట్టలేరు. అధికారం కోల్పోయిన యువరాజుకు మతిభ్రమించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. 'మాకు డబ్బు వ్యామోహం లేదు అని కేటీఆర్ అంటున్నాడు.. మీకు డబ్బు వ్యామోహం లేదంటే ప్రజలు ఎలా నమ్ముతారు. కమిషన్ల కోసమే మీ సోదరి MLC కవిత గారు ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేశారు. 7 లక్షల కోట్లలో కాంట్రాక్టర్లకు ఎన్ని లక్షల కోట్లు అప్పనంగా ముట్ట చెప్పారు చెప్పాలి. పాత పాటలు పాడొద్దు కేటీఆర్.. కొత్త ముచ్చట చెప్పండి తెలంగాణ ప్రజలు నమ్ముతారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీ నాయన 2002లో ఏదైతే నినాదంతో వచ్చాడో ఈరోజు మీరు కూడా అదే నినాదం చెబుతున్నారు తెలంగాణ ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరు. దళిత ముఖ్యమంత్రి, ఉద్యోగ నియామకాలు కాపల కుక్కని అని ప్రజలను నమ్మించి మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అప్పు చేసిన ఏడు లక్షల కోట్లు సరైన పద్ధతిలో ఖర్చు చేసుంటే కేజీ టు పీజీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతులందరికీ రుణమాఫీ, రైతు భరోసా మరియు హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం ఇవన్నీ అందేవి. పదేళ్ళలో చేసిన ఏడు లక్షల కోట్లలో అప్పులో లక్ష కోట్లు దండుకున్నది మీ కుటుంబం. ఇపుడు దొంగ ఏడుపులు ఎందుకు ఏడుస్తున్నారు." అంటూ చామల ఆగ్రహం వ్యక్తం చేశారు.