- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP News:ఏపీలో కరువు పరిస్థితుల పై కేంద్రానికి నివేదిక
దిశ, డైనమిక్ బ్యూరో: రైతులను ఆదుకోవడానికి సత్వరమే రూ.151.77 కోట్లు సాయం కావాలని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా కోరారు. కేంద్ర ప్రభుత్వ కరువు బృందంతో సమావేశంలో ఏపీలో కరువు పరిస్థితులను రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా వివరించారు. ఏపీలో ఖరీఫ్-2024 కరువు పరిస్థితుల పై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఖరీఫ్ కరువు పరిస్థితులను కేంద్ర బృందం అధ్యయనం చేస్తుందని తెలిపారు. నష్టపోయిన పంట వివరాల పై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని అన్నారు. రైతులను ఆదుకోవడానికి సత్వరమే రూ.151.77 కోట్లు సాయం చేయాలని కోరారు.
సాయం అందించే విషయంలో ఉదారంగా స్పందించాలని అన్నారు. వ్యవసాయ శాఖ రూ. 90.62కోట్లు, రూరల్ వాటర్ సప్లై రూ. 0.78 కోట్లు, అర్బన్ వాటర్ సప్లై రూ. 4.89 కోట్లు, పశు సంవర్ధక శాఖ రూ.55.47 కోట్ల మేరకు ఆర్థిక సహాయం అవసరమని అన్నారు. ఐదు జిల్లాల్లో 27 తీవ్ర కరువు మండలాలు, 27 మధ్యస్థ కరువు మండలాలుగా గుర్తించినట్లు వివరించారు. అన్నమయ్య - 19, చిత్తూరు - 16, శ్రీ సత్య సాయి - 10, అనంతపురం - 7 కర్నూలు – 2 మండలాలను గుర్తించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు నివారణ చర్యలను చేపట్టిందని చెప్పారు. రూ.16.67 కోట్ల వ్యయంతో సుమారు లక్ష మంది రైతులకు 80 శాతం సబ్సిడీ పై విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.