- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వడమే ధ్యేయం
దిశ,తల్లాడ : సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వడమే ధ్యేయం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బిల్లుపాడు గ్రామంలోని జిల్లా కాంగ్రెస్ నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి విగ్రహ ఆవిష్కరణకు శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనకల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం గంగిదేవిపాడు నూతన కార్యాలయం, గోదాం ప్రారంభోత్సవం కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయితో కలిసి పాల్గొన్నారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వం రైతన్నల ప్రభుత్వమని, రైతులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని, రాబోయే రోజుల్లో రైతు భరోసాతో పాటు రైతు బీమా అందిస్తామన్నారు.
వచ్చే ఖరీఫ్ పంట నుంచి ప్రతి ఎకరానికి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేయించి ప్రీమియం ఇస్తామన్నారు. అలాగే వరి ధాన్యాన్ని పండించే రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలని కోరారు. అలాగే కో ఆపరేటివ్ సంస్థల ద్వారా గోదాములు, వ్యవసాయ పనిముట్లు అందించనున్నట్టు చెప్పారు. ఇందుకు ప్రభుత్వం రూ. 5 వేల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. అలాగే కొత్త సహకార సంఘాలను ఏర్పాటు చేస్తామన్నారు. సీతారాం ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో గంగిదేవిపాడు వాగు, కట్టలేరు, పాలేరు, కృష్ణ నది ద్వారా నీరు రాకపోతే గోదావరి జలాలతో సాగు నీరు అందిస్తామన్నారు. రైతు బీమా పథకానికి రూ. 3 వేల కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.