- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
న్యూజిలాండ్‌దే వన్డే సిరీస్.. రెండో వన్డేలో 113 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం
దిశ, స్పోర్ట్స్ : శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. హమిల్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 37 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 37 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లలో రచిన్ రవీంద్ర (79), చంపన్(62) రాణించారు. ఈ మ్యాచ్‌లో తీక్షణ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన ఫలితం దక్కలేదు. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 30.2 ఓవర్లలో 142 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. కమిందు మెండిస్(64) ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్లంతా న్యూజిలాండ్ బౌలింగ్ ధాటికి చేతులెత్తేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో విలియమ్ 3, జాకబ్ డఫీ 2 వికెట్లు పడగొట్టి రాణించారు. రచిన్ రవీంద్ర ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.