- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లొట్టపీసు కేసే అయినప్పుడు భయం ఎందుకు?
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)పై కాంగ్రెస్(Congress) ఎంపీ మల్లు రవి(Mallu Ravi) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్న పదేళ్లలో కేటీఆర్(KTR) అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి.. దొంగగా నిర్ధారణ అయ్యాక.. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పైన అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి పిచ్చి పట్టిందని కీలక వ్యాఖ్యలు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి రూ.55 కోట్ల ప్రజాధనాన్ని విదేశీ కంపెనీలకు ఇచ్చి ఇప్పుడు నిజాయితీ పరునిలాగా మాట్లాడటం విడ్డురంగా ఉందని ఎద్దేవా చేశారు. ‘అసలు ఇది కేసు కాదు.. లొట్టపీసు కేసు అని, దమ్ముంటే అరెస్ట్ చెయ్యమని, నా వెంట్రుక కూడా పీకలేరు’ అని అనేక మాటలు మాట్లాడిన కేటీఆర్.. ఇప్పుడెందుకు అరెస్ట్ చేయకుండా చూడాలని హైకోర్టు(High Court), సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయిస్తున్నాడని మండిపడ్డారు.
లొట్టపీసు కేసే అయినప్పుడు భయం ఎందుకని ప్రశ్నించారు. చట్టంపైన పూర్తి నమ్మకం ఉందని.. తనలోని భయాన్ని తానే ప్రపంచానికి చూపిస్తున్నాడని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ముందే చెప్పారు.. కేటీఆర్ తాను తప్పు చేశాననే విషయాన్ని దాటవేసేందుకు రేవంత్ రెడ్డిపైన అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. కేటీఆర్ మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరని తెలిపారు. తప్పు చేయకపోతే కోర్టులో తన నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు.