Rajini: పార్టీకి మర్రి రాజశేఖర్ రాజీనామా.. మాజీ మంత్రి విడదల రజిని రియాక్షన్ ఇదే!

by Shiva |
Rajini: పార్టీకి మర్రి రాజశేఖర్ రాజీనామా.. మాజీ మంత్రి విడదల రజిని రియాక్షన్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ (YCP)కి, ఎమ్మెల్సీ (MLC) సభ్యత్వానికి మర్రి రాజశేఖర్ (Marri Rajashekar) రాజీనామా చేసిన విషయం అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి విడదల రజిని (Vidadala Rajini) మర్రి రాజీనామాపై తాజాగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె చిలకలూరిపేట (Chilakaluripeta)లో మాట్లాడుతూ.. రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ (Marri Rajashekar) ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. వ్యక్తిగతంగా మాజీ సీఎం జగన్ (Jagan), వైఎస్ కుటుంబం (YS Family) ఆయనకు సముచిత గౌరవం ఇచ్చిందని తెలిపారు. పార్టీలో ఎక్కడా ఆయన గౌరవానికి భంగం వాటిల్లేలా ఎలాంటి పనులు కూడా చేయలేదన్నారు. మర్రి గెలుపు కోసం వైఎస్ జగన్ (YS Jagan) కూడా ప్రచారం చేశారని, రెడ్ బుక్ (Red Book) పాలనలో తన వాయిస్ వినిపించే ఉంటే ఆయన గౌరవం మరింత పెరిగి ఉండదేని అన్నారు. జగన్ చెబితేనే తాను గుంటూరు వెస్ట్ (Guntur West) నుంచి పోటీ చేశానని, తిరిగి ఆయన పంపితేనే చిలకలూరిపేట (Chilakaluripeta) వచ్చానని కామెంట్ చేశారు. తమ అధినేత ఆదేశాలను పాటించడమే తనకు తెలుసని రజిని స్పష్టం చేశారు.

Advertisement
Next Story

Most Viewed