- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అలియా నా మొదటి భార్య కాదు.. బిగ్ షాకిచ్చిన రణ్బీర్ కపూర్?

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్(Ranbir Kapoor) పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సాధించాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు కూడా పుట్టింది. అయితే అలియా, రణ్బీర్ కపూర్ ఇద్దరు వరుస మూవీస్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక రణ్బీర్ కపూర్ ఇటీవల ‘యానిమల్’సినిమాతో హిట్ సాధించి వరల్డ్ వైడ్గా ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘రామాయణ’సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా, రణ్బీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘నేను ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఓ అమ్మాయి నన్ను బాగా అభిమానించేది. నేను ఊర్లో లేని సమయంలో ఆ అమ్మాయి పురోహితుడిని తీసుకొచ్చి నా ఇంటి గేటుని పెళ్లి చేసుకుంది. గేట్కు పువ్వులు బొట్టు పెట్టి నన్ను భర్తగా స్వికరించినట్లు చెప్పిందట.
అయితే నేను ఊరి నుంచి వచ్చాక మా వాచ్మెన్ జరిగిన విషయాన్ని చెప్పగానే నేను క్రేజీగా ఉందని అనుకున్నాను. ఇప్పటివరకైతే నా తొలి భార్యని కలుసుకోలేకపోయాను. ఏదో రోజు కచ్చితంగా కలుస్తానని అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ రణ్బీర్ కపూర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే అలియా మొదటి భార్య కాదని అంతా చర్చించుకుంటున్నారు.